అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoist Leaders Surrender | మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. వారితో పాటు మరో 40 మంది సరెండర్ అయినట్లు సమాచారం. మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivdhar Reddy) మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.
మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసు (Telangana Police)ల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పోలిట్ బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి సైతం ఆయుధాలు వీడారు. మరో 40 మందితో కలిసి తెలంగాణ ఎస్ఐబీ పోలీసుల ఎదట వీరు సరెండర్ అయ్యారు. ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం కావడంతో ఏకంగా మావోయిస్ట్ పార్టీ (Maoist Party) సెక్రెటరీ సరెండర్ అయ్యారు. లొంగుబాటకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అధికారులు ధ్రువీకరించలేదు. మంగళవారం డీజీపీ మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు.
Maoist Leaders Surrender | భారీగా ఆయుధాలు స్వాధీనం
లొంగిపోయి మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. తాజాగా పార్టీ సెక్రెటరీ సైతం సరెండర్ అయ్యారు. దీంతో మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసినట్టేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. చాలా మంది సరెండర్ అయ్యారు. కొత్తగా రిక్రూట్మెంట్లు లేవు. దీంతో పార్టీ బలహీనంగా మారింది. మరోవైపు అడవుల్లో ఉన్న నక్సలైట్ల కోసం బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
