HomeతెలంగాణVice President candidate | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

Vice President candidate | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President candidate | విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్​ సుదర్శన్​రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది.

జగదీప్​ ధన్​ఖడ్​ రాజీనామాతో (Jagdeep Dhankhar Resigns) ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్డీఏ తన అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్​గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్​ను (CP Radhakrishnan) ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా.. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించింది. ప్రధాని మోదీ (Prime Minister Modi), కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్ (Union Minister Rajnath Singh)​ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విపక్షాలను కోరారు.

Vice President candidate | బలం లేకున్నా..

ఇండియా కూటమికి బలం లేకున్నా.. సుదర్శన్​రెడ్డిని (Sudarshan Reddy) ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే​ ప్రకటించారు. ఉప రాష్ట్ర‌ప‌తిని రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ స‌భ్యులు క‌లిసి ఎన్నుకుంటారు. నామినేట్ చేయబడిన వారితో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Election) ఓటు వేస్తారు. ఉభయ సభల్లో మొత్తం 782 మంది స‌భ్యులు ఉండ‌గా, ఉప రాష్ట్ర‌ప‌తిగా గెల‌వాలంటే 392 ఓట్లు రావాలి.

లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, విప‌క్ష కూట‌మికి 234 మంది సభ్యులు ఉన్నారు. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకు 130 మంది స‌భ్యులు ఉండ‌గా, ఇండి బ్లాక్‌కు 79 మంది సభ్యుల మద్దతు మాత్ర‌మే ఉంది. అధికార ఎన్డీయే కూటమికి మొత్తం 423 మంది ఎంపీలు ఉండటంతో సులువుగా గెలుస్తుంది. అయినా విపక్ష కూటమి అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం.

Vice President candidate | సుదర్శన్​రెడ్డి నేపథ్యం

విపక్ష కూటమి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయమూర్తిగా (AP High Court Judge), గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. అనంతరం సుప్రీంకోర్టు జడ్జిగా(Supreme Court Judge) పదోన్నతి పొందారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది 2011 జూలై 8న పదవీ విరమణ చేశారు. గోవా మొదటి లోకాయుక్తాగా 2013లో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్​లో ఆయన వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు.