అక్షరటుడే, ఇందూరు: Telangana Jagruti | తెలంగాణ జాగృతి జిల్లా అడ్ హాక్ కమిటీని బుధవారం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. జిల్లా కమిటీలో సూదం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజాక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, మహమ్మద్ రెహాన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ పటేల్‌ను నియమించారు. అలాగే అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, సంజీవ్, శేఖర్ రాజ్, సంతోష్ నాయక్, తిరుపతి రామును నియమించారు.
Telangana Jagruti | బోధన్ నియోజకవర్గం..
జిల్లా కమిటీతో పాటు నియోజకవర్గాల వారీగా అడ్ హక్ కమిటీలను (constituency-wise ad hoc committees) ప్రకటించారు. ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గ కమిటీలో ప్రవీణ్ కుమార్, రాఘవేందర్ యాదవ్, సాయిలు, నూర్ ఫతేపూర్, శ్రీనివాస్ ఉన్నారు.
Telangana Jagruti | నిజామాబాద్ అర్బన్ కమిటీ..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ (Nizamabad Urban Constituency) అడ్ హక్ కమిటీలో కరిపె రాజు, మహమ్మద్ రెహాన్ అహ్మద్, శంకర్, పంచ రెడ్డి మురళి, ఎండల ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, సాయి కృష్ణ, శానవాజ్ ఖాన్‌ను నియమించారు. నిజామాబాద్ రూరల్‌లో బానోతు నరేష్ నాయక్, బానోత్ ప్రేమ్ దాస్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Jagruti | ఆర్మూర్, బాల్కొండ కమిటీ..
ఆర్మూర్ నియోజకవర్గ కమిటీలో ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్ రావు, మహమ్మద్ ఆజం, బాల్కొండ నియోజకవర్గం కమిటీలో మహేందర్ రెడ్డి, ధీరజ్‌లను నియమించారు.
