HomeతెలంగాణCM Revanth Reddy | వారి బంధంతో తెలంగాణకు తీరని నష్టం: సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | వారి బంధంతో తెలంగాణకు తీరని నష్టం: సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | వైఎస్​ జగన్ (YS Jagan)​ రెడ్డితో అనుబంధంతో తెలంగాణకు అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రానికి​ తీరని నష్టం చేశారని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.

కృష్ణా జలాలపై (Krishna Water) ప్రజా భవన్​లో ప్రభుత్వం పవర్ పాయింట్​​ ప్రజంటేషన్​ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బేసిన్లు, బేషజాలు లేవంటూ ఆంధ్రావాళ్లను నీళ్లు తీసుకుపొమ్మని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని రైతులకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇచ్చారని మండిపడ్డారు.

CM Revanth Reddy | అసెంబ్లీలో చర్చిద్దాం

తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖకు కేసీఆర్ కుటుంబం (KCR Family)లోని వారే మంత్రులుగా ఉన్నారని సీఎం అన్నారు. బీఆర్ఎస్ (BRS) వాళ్లు వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేత ఏ రోజు చర్చిద్దాం అంటారో స్పీకర్​కు లేఖ రాయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామన్నారు. క్లబ్బులు, పబ్బుల్లో కాదు అసెంబ్లీలో చర్చకు రావాలని సూచించారు.

CM Revanth Reddy | ఆయన పేరు ఎత్తితే నా స్థాయి తగ్గుతుంది

సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR)​ను ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సవాలు చేయలేదని.. అసెంబ్లీలో చర్చిద్దామని సూచించానన్నారు. అయితే కేటీఆర్​ ప్రెస్​క్లబ్​కు సవాల్​ పేరిట వెళ్లారని పరోక్షంగా అన్నారు. ఆయన పేరు తాను చెప్పాలనుకోవడం లేదన్నారు. అతని పేరు చెప్పినా తన స్థాయి తగ్గుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి భాషకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసని, కానీ ఆ దిశగా వెళ్లాలనుకోవడం లేదన్నారు.

ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో చర్చకు కూడా తాము సిద్ధం అన్నారు. కేసీఆర్​కు ఆరోగ్యం సహకరించడం లేదంటే ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో మాక్​ అసెంబ్లీ పెడతామన్నారు. తాను తమ మంత్రుల బృందాన్ని పంపిస్తామన్నారు. క్లబ్బులు, పబ్బులు అంటేనే తమకు ఇబ్బంది అని.. సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఎర్రవల్లిలో సమావేశం పెడదామని కేసీఆర్​ లేఖ రాస్తే.. తాను కూడా వస్తానన్నారు. మంత్రులతో పాటు తాను కూడా చర్చలో పాల్గొంటానని ఆయన తెలిపారు.