అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Ponguleti | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే తెలంగాణకు నూతన దిశానిర్దేశం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు చెప్పారు.
నాంపల్లిలోని మీడియా అకాడమీ ప్రాంగణంలో శుక్రవారం సమాచార, పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా ప్రజా సంబంధాల అధికారుల పునశ్చరణ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ అన్ని రంగాలలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పారు. దశలవారీగా రాష్ట్రాన్ని ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను (welfare programs) వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
Minister Ponguleti | పేదలకు అండగా..
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు అండగా నిలిచిందన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, సన్నబియ్యం సరఫరా, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి రంగాలలో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ప్రజల మధ్య కీలక వారధిగా పనిచేసే ప్రజా సంబంధాల అధికారుల పాత్రను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న మీడియా పోకడలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల ద్వారా సమర్థవంతంగా ప్రచారం చేయాలని సూచించారు.
Minister Ponguleti | పదోన్నతులు కల్పించాలి
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ పథకాల విజయవంతమైన అమలును నిశితంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో సమర్థవంతమైన జిల్లా ప్రజా సంబంధాల అధికారులను (District Public Relations Officers) నియమించాలన్నారు. ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్లను రద్దు చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలలని సూచించారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సమాచార, పౌర సంబంధాల కమిషనర్‌ను ఆదేశించారు.