అక్షరటుడే, హైదరాబాద్: Inter Results తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy cm Bhatti Vikramarka) ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
ఫలితాల విడుదల కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హాజరుకానున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in, వెబ్‌సైట్ లో చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబరును ఆన్లైన్లో ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. తెలంగాణలో మార్చి నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.