అక్షరటుడే, కమ్మర్పల్లి: Telangana Inter Hall Tickets | తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు (Inter Board) మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
Telangana Inter Hall Tickets | 18నుంచి హాల్‌టికెట్లు..
ఇంటర్ పరీక్షల (Inter Exams) హాల్ టికెట్లు ఈనెల 18న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నుంచి విద్యార్థుల హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు కళాశాలల లాగిన్‌లో పొందుపర్చనుంది. ఈనెల 20న విద్యార్థులు/తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్‌లకు హాల్ టికెట్లను పంపిస్తారు. బోర్డు వెబ్సైట్లోనూ పొందుపరుస్తారు.
ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినప్పటికీ..
విద్యార్థులు కళాశాల లాగిన్ ఐడీ, ఇంటర్ వెబ్సైట్, వాట్సాప్‌నకు పంపించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు రాయవచ్చు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. పేరు, ఫొటో, సబ్జెక్టుల్లో తప్పులు దొర్లితే కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ (QR Code)ను ముద్రిస్తున్నారు. పరీక్షకేంద్రం (Examination Center) రూట్ మ్యాప్‌తో అనుసంధానించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,96,529 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 1,495 సెంటర్లు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా..
జిల్లావ్యాప్తంగా పరీక్షల నిమిత్తం 58 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 16,336 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే ఒకేషనల్‌లో 2,963 విద్యార్థులు ఉన్నారు. సెకండియర్‌లో 14,893 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకేషనల్‌లో 2,771మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 36,963 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.