Inter Exams 2026 | రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఇంటర్మీడియట్​ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధిత అధికారులు ఆయా కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Inter Exams 2026 | ఇంటర్మీడియట్​ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధిత అధికారులు ఆయా కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్​ టికెట్ల (Hall Tickets) పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది.

Inter Exams 2026 | మార్చి 18వ తేదీవరకు..

ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఫస్ట్​ ఇయర్ విద్యార్థులకు ఒకరోజు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తర్వాతి రోజు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి (Inter Board Secretary) కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటలకు (ఐదు నిమిషాలు ఆలస్యమైనా) పరీక్షలకు అనుమతిస్తామన్నారు. అయితే విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా 1,495 కేంద్రాలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రైవేట్ కాలేజీలు 863, ప్రభుత్వ కాలేజీలు 425, పాఠశాలల్లో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు (Students) హాజరవుతున్నట్లు కృష్ణ ఆదిత్య తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు, రవాణా, విద్య, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖలతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad)​లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం నుంచి పరీక్షలను పర్యవేక్షిస్తామన్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు 14416 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించేందుకు టెలీమానస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Inter Exams 2026 | విద్యార్థులకు సూచనలు..

మొబైల్ ద్వారా హాల్ టికెట్ డౌన్​లోడ్​ చేసుకోవచ్చని ఇంటర్​ అధికారులు పేర్కొన్నారు.. హాల్ టికెట్​పై ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చు. హాల్ టికెట్ డౌన్​లోడ్​ చేసుకున్న తర్వాత పేరు, మీడియం, సబ్జెక్టును పరిశీలించి తప్పులుంటే సరి చేయించుకోవాలి. ఏ కారణంగానైనా హాల్ టికెట్ ఇవ్వడానికి ప్రైవేట్ కళాశాలలు నిరాకరిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు.

Inter Exams 2026 | 8.45కల్లా ఓఎంఆర్​ షీట్​..

పరీక్ష కేంద్రాల్లో (Examination Centers) 8:45 గంటల కల్లా ఓఎంఆర్ షీట్​పై వివరాలను సరి చేసుకోవాలి. 9 గంటలకు ప్రశ్నాపత్రం ఇవ్వగానే బార్ కోడ్​తో ఉన్న 24 పేజీల బుక్​లెట్​లో మొత్తం సమాధానాలు రాయాలి. పరీక్ష హాల్లోకి రాసిన, ప్రింట్ చేసిన మెటీరియల్​ను అనుమతించరు. సెల్​ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావద్దు.

Inter Exams 2026 | రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో..

రాష్ట్రవ్యాప్తంగా 1,495 మంది చీఫ్​ సూపరింటెండెంట్లు విధుల్లో ఉంటారు. అలాగే డిపార్ట్​మెంట్​ అధికారులు 1,495, ఇన్విజిలేటర్లు 29,500, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 75, సిట్టింగ్స్ స్క్వాడ్ 200 ఉన్నారు. ఫస్టియర్​లో బాలురు 2,17,428, బాలికలు 2,24,437 పరీక్షలు రాయనున్నారు. ఒకేషనల్ విద్యార్థులు బాలురు 22,586, బాలికలు 24,675 మొత్తంగా ఫస్టియర్​ విద్యార్థులు 4,89,126 రాస్తున్నారు. అలాగే సెకండియర్​లో బాలురు 2,31,471, బాలికలు 2,30,850 పరీక్షలు రాస్తున్నారు. ఒకేషనల్​లో సెకండియర్​ బాలురు-22,429, బాలికలు 23,199 మంది పరీక్షలు రాయనున్నారు.

Related articles

KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.