అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాకింగ్ చేస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను (Telangana High Court website) దుండగులు హ్యాక్ చేశారు.
హ్యాకర్లు హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ (High Court website Hack) చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ (online betting site) ఓపెన్ అయింది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులు బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
High Court | సమస్య పరిష్కారం
హైకోర్టు వెబ్‌సైట్ ఈ నెల 11న హ్యాక్ అయినట్లు సమాచారం. అదేరోజు రిజిస్ట్రార్ సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెబ్‌సైట్ సమస్యను పరిష్కరించారు. అనంతరం నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ (IP address) ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా విదేశాలకు చెందిన పలువురు హ్యాకర్లు గతంలో సైతం ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. పలు ప్రభుత్వ, ఇతర వెబ్సైట్లను దుండగులు హ్యాక్ చేస్తున్నారు. ప్రజలకు సంబంధించి సమాచారాన్ని తస్కరిస్తున్నారు.
