అక్షరటుడే, హైదరాబాద్: Telangana High Court : తెలంగాణలో పెండింగు చలాన్ల e challan విషయంలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల traffic police కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ ఇచ్చింది. పెండింగు చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించమంటూ వాహన కీస్ లాగేసుకోవడం, వాహనం నిలిపివేయడం వంటివి చేయొద్దని ఆదేశించింది. స్వచ్ఛందంగా వాహనదారులే చలాన్లు చెల్లిస్తే పోలీసులు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ పెండింగు చలాన్లను వసూలు చేయాలనుకుంటే.. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది.
Telangana High Court : వాహనాలను లాగేసుకోవద్దు..
ఎక్కడబడితే అక్కడ నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేయడం, కీస్ లాగేసుకోవడం వంటివి చేస్తూ.. బలవంతంగా చలాన్ల జరిమానాలను వసూలు చేస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై మంగళవారం (జనవరి 20) విచారణ చేపట్టిన ధర్మాసనం పై విధంగా స్పందించింది.
పిటిషనర్ తరఫున అడ్వకేట్ విజయ్ గోపాల్ వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగు చలాన్లను బలవంతంగా వసూలు చేయొద్దని ఆదేశించింది.