అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Half day schools | తెలంగాణ విద్యాశాఖ అధికారులు విద్యార్థులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఎండలు పెరిగాయి. శివరాత్రి అయిపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నారు. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండనున్నాయని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో విద్యా శాఖ (Department of Education) అధికారులు ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు హాఫ్‌డే స్కూల్స్ కొనసాగించాలన్నారు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు (SSC Exams) జరగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు అయిపోయాక.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.