అక్షరటుడే, వెబ్డెస్క్ :Miss World Compititions | హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు(Miss World Compititions) చాలా గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ Telangana ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పోటీల్లో దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్(Miss World Contestants) ఇటీవల చార్మినార్ వద్ద సందడి చేశారు. ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్(Chowmahalla Palace).. ఈ విందుకు వేదిక అయింది. 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు, ప్రతినిధులతో చౌమొహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది.
Miss World Competitions | కలిసిపోయారట..
ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ విందులో రేవంత్ రెడ్డి Revanth Reddy తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్(Chowmahalla Palace)ను సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున(Nagarjuna) కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీ లని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది.
స్వయంగా సీఎం(CM) ఇన్వైట్ చేయడంతో నాగార్జున(Nagarjuna), అల్లు అరవింద్(Allu Aravind) విందుకి హాజరయ్యారు. వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి తో ముచ్చటిస్తూ కనిపించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల కారణంగా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్(N Convention Centre) ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున NAgarjuna కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు. అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు గురించి ఆ టైంలో చర్చలు జరిగాయి.