అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cabinet meeting | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ప్రతినెల ఒకటో, మూడో సోమవారం మీటింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల గురించి మంత్రివర్గం(Ministerial Council)లో చర్చించనున్నారు. ప్రస్తుతం అవసరాన్ని బట్టి కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు. ఇక నుంచి అలా కాకుండా విధానపరమైన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు నెలకు రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.