అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahalakshmi scheme | మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చే దిశగా అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే మహిళలకు ప్రత్యేకంగా ‘స్మార్ట్ కార్డు’ (Smart Card) లేదా కామన్ మొబిలిటీ కార్డును అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.తొలి దశలో ఈ స్మార్ట్ కార్డులను మహాలక్ష్మీ పథకంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) (Center for Good Governance)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ కార్డులు కేవలం బస్సు పాస్లా కాకుండా, మల్టీ పర్పస్ డిజిటల్ వాలెట్‌గా ఉపయోగించేలా రూపొందిస్తున్నారు.
Mahalakshmi scheme | ఆధార్ అక్కర్లేదు..
ఈ కామన్ మొబిలిటీ కార్డు (Common Mobility Card) ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాకుండా, కార్డులో డబ్బు లోడ్ చేసుకుని మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఈ కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయడం కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ కార్డు అమల్లోకి వస్తే ప్రయాణికులు ఇకపై ప్రతి సారి ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతి ప్రయాణం డిజిటల్‌గా Digital నమోదు కావడం వల్ల, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరిన్ని బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించనుంది. దీంతో రవాణా వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు మహాలక్ష్మీ పథకం కింద సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు అంచనా. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి RTC దాదాపు రూ. 8,500 కోట్లను చెల్లించింది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలందరికీ ఈ తరహా స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తే, అది తెలంగాణ డిజిటల్ విప్లవానికి నాంది అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.