అక్షరటుడే, వెబ్డెస్క్ : Job Notification | తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని నియామక ప్రక్రియలు పూర్తవ్వగా, మిగిలినవాటిపై వేగంగా ప్రక్రియను కొనసాగించేందుకు టీజీపీఎస్సీ (TGPSC) తో పాటు ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు రంగంలోకి దిగాయి.
Job Notification | ఇప్పటికే ప్రారంభమైన నియామక ప్రక్రియలు
- ఇటీవలే గ్రూప్-1 కింద 563 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు (Appointment Orders) అందాయి.
- అలాగే గ్రూప్-2 కింద 783 పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. వీరికి కూడా త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది.
- ప్రస్తుతం గ్రూప్-3 పోస్టులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. ఈ నియామక ప్రక్రియను ఈ నెలలోపు పూర్తిచేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
రాబోయే నియామకాలు – శాఖల వారీగా:
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా:
వ్యవసాయ శాఖ,విద్యా శాఖ,విద్యుత్ శాఖ,వర్సిటీలు,గురుకుల పాఠశాలలు,ప్రభుత్వ పాఠశాలలు మొదలైన వాటిలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది.ఇక, కొత్త రిజర్వేషన్ విధానానికి అనుగుణంగా రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని కూడా అధికారులంతా సిద్ధం చేస్తున్నారు.
భర్తీకి సిద్ధంగా ఉన్న ఖాళీలు
- పోలీస్ శాఖలో మాత్రమే సుమారు 17,000 ఖాళీలు ఉన్నాయి.
- మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25,000 ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉన్నట్లు సమాచారం.
- త్వరలోనే గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.
Job Notification | రాజకీయ నేపథ్యంలో నోటిఫికేషన్లు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చి ఈ డిసెంబరుకు రెండేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యంగా యువతలో విశ్వాసం కలిగించేందుకు వచ్చే నెలలలో భారీ నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.తాజా సమాచారం కోసం TGPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.