అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Holidays List | కాలం కరిగిపోతుంది. మరో ఏడాది కాలగర్భంలో కలిసి పోతుంది. త్వరలో 2026 సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం 2026లో సెలవు దినాల జాబితాను విడుదల చేసింది.
జనవరిలో బోగి, సంక్రాంతి (Sankranthi) నేపథ్యంలో 14, 15 తేదీల్లో సెలవు ఉంటుంది. 26న గణతంత్ర దినోత్సవం, ఫిబ్రవరి 15 శివరాత్రి (Shivrathri), మార్చి 3న హోళీ, 19న ఉగాది, 21, 22 తేదీల్లో రంజాన్, 27న శ్రీరామ నవమి సందర్భంగా సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, 6న జగ్జీవన్‌రామ్ జయంతి, 14న అంబేడ్కర్ జయంతి, మే 27న బక్రీద్, జూన్ 26న మొహర్రం సందర్భంగా సెలవు ప్రకటించింది. ఆగస్టు 10న బోనాలు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 26న మిలాద్ ఉన్ నబి, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 14న వినాయక చవితి, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 18న సద్దుల బతుకమ్మ, 20న దసరా సెలవులు ఉంటాయి. 21న దసరా మరుసటి రోజు సైతం హాలీడే ప్రకటించింది. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25, 26 తేదీల్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి.
Holidays List | ఆఫ్షనల్ హాలీడేస్ లిస్ట్
జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం ఆఫ్షనల్ హాలీడే (Optional Holiday) ప్రకటించింది. 3న హజ్రత్ జయంతి, 16న కనుమ, 23న శ్రీ పంచమి, ఫిబ్రవరి 4 షబ్ ఏ బరత్, మార్చి 10, 13, 17 తేదీల్లో సైతం ఐచ్ఛిక సెలవులు ఇచ్చింది. మార్చి 31న మహవీర్ జయంతి, ఏప్రిల్ 20 బసవ జయంతి, మే 1 బుద్ధ పౌర్ణిమ, జూన్ 4 ఈద్ ఈ గదిర్, 25న మొహర్రం, జులై 16 రథయాత్ర, ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం, 28 రాఖీ పౌర్ణమి రోజుల్లో సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో భాగంగా 9 వారాంతాలు కలిసి వచ్చాయి. సోమవారం, శుక్రవారం సెలవులు వేసుకుని టూర్లకు వెళ్లడానికి అవకాశం ఉంది. అయితే దీపావళి, బతుకమ్మ పండుగలు ఆదివారం రావడం గమనార్హం.