Film Chamber
Film Chamber | తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెంట్‌ రాజీనామా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Film Chamber | తెలంగాణ ఫిల్మ్​ చాంబర్ (Telangana Film Chamber)​ అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్​ నారంగ్​ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటలలోపే సునీల్ రాజీనామా చేయడం గమనార్హం. కొందరి వ్యాఖ్యలు తనను బాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా.. కొందరు ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు.

కాగా.. ఇటీవల ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యం కూడా పెరిగింది. ప్రత్యేకించి బడా హీరోలు, భారీ బడ్జెట్లో వచ్చే సినిమాల విషయంలో వివాదం తలెత్తింది.