అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Employees Health Scheme | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. 15 రోజుల్లో కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (Health Scheme) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ సమావేశం గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 15 రోజుల్లో కొత్త హెల్త్ పాలసీని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ప్రారంభించాలని నిర్ణయించారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Employees Health Scheme | 1.5శాతం కాంట్రిబ్యూషన్
ప్రతిపాదిత కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉద్యోగులు వారి బేసిక్ శాలరీలో 1.5శాతం విరాళం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మరో 1.5 శాతం వాటాను జమ చేస్తుంది. ఈ ప్రతిపాదనకు ఉద్యోగుల ప్రతినిధులు అంగీకరించారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ఖరారు చేస్తామని, ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని ప్రధాన కార్యదర్శి ఉద్యోగి సంఘాల నాయకులకు తెలిపారు.
Employees Health Scheme | ఉద్యోగుల వివరాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 1.44 లక్షల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 12.84 లక్షల మంది వారిపై ఆధారపడినవారు ఉన్నారు. క్లాస్-IV ఉద్యోగులు, నాన్-గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తమ బేసిక్ శాలరీలో 1.5 శాతం విరాళం ఇస్తే, ఈ పథకం ఏటా సుమారు రూ.528 కోట్లు సమకూరనుంది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (Health Care Trust)లో ఉద్యోగి సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని ట్రస్ట్ CEO గా నియమిస్తారు.
Employees Health Scheme | అగ్ని ప్రమాదాల నివారణపై..
పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. పారిశ్రామిక అగ్ని ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు, ప్రామాణిక నిర్వహణ విధానాలను వివరించే సమగ్ర మాన్యువల్‌ను సిద్ధం చేయాలన్నారు. సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries)లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. మరణించిన కార్మికులు, బాధిత కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా చెల్లింపునకు సంబంధించిన పురోగతిని, అలాగే సంబంధిత కోర్టు కేసుల స్థితిని కూడా ఆయన సమీక్షించారు.