అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallareddy BRS | మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Jajala Surender) అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో (Deeksha Diwas program) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. నవంబర్ 29వ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజున్నారు. ఆ రోజు కేసీఆర్ (KCR) చావు నోట్లో తలపెట్టి, మొక్కవోని పట్టుదలతో దీక్ష చేసి, ఢిల్లీ మెడలు వంచారని గుర్తు చేశారు.
కేసీఆర్ చేసిన పోరాట పటిమకు ఢిల్లీ గడగడ లాడిపోయిందని.. యావత్తు తెలంగాణ బెబ్బులిలా నిలబడి బరిగీసి కొట్లాడిందన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.