అక్షరటుడే, హైదరాబాద్: Telangana Cabinet | స్థానిక సంస్థల ఎన్నికల్లో local body elections పోటీ పడే అభ్యర్థుల candidates అర్హతల విషయంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది.
ఎన్నికల్లో పోటీపడే కొందరు అభ్యర్థులకు అడ్డుగా భావిస్తున్న ఇద్దరు పిల్లలు నిబంధనపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet | సన్న వడ్లకు బోనస్
ఈ నిబంధనను తొలగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో గురువారం (అక్బోబరు16) సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
ఈ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పలు రంగాలకు భూ కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే వ్యవసాయ కళాశాలల agricultural colleges గురించి కూడా వివరించారు.