అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy అధ్యక్షతన సా.4 గంటలకు కేబినెట్ భేటీ ఉంటుంది.
ఈ సమావేశంలో కులగణన నివేదిక(caste census report)పై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. అలాగే గోశాల విధానం (cowshed policy)పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
దీనికి తోడు కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, వానాకాలం (monsoon) సాగు పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో.. యూరియా లభ్యత, డిమాండ్‌పై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.