Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Meeting | తెలంగాణ మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్​లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు (Budget Meetings) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశ పెడతారు. బడ్జెట్​ గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు, కొత్త పథకాలు, అభివృద్ధికి నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) వ్యవహరించాల్సిన తీరు గురించి సీఎం మంత్రులకు వివరించనున్నారు. అలాగే గోదావరి జలాలపై సభలో చర్చిస్తామని ఆదివారం సీఎం తెలిపిన విషయం తెలిసిందే. దీని గురించి సైతం కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది.

Telangana Cabinet Meeting | ఎన్నికలపై..

రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) ప్రశాంతంగా ముగిశాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర దాటిపోతున్నా.. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలాక వీటిపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం చెప్పింది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం ప్రభావం చూపకపోవడంతో.. ఆ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. మంత్రివర్గ సమావేశంలో దీని గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే జీహెచ్​ఎంసీ పాలకవర్గం పదవీకాలం కూడా అయిపోయింది. ఆ ఎన్నికల గురించి సైతం చర్చించనున్నారు. అయితే రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో ఇంటర్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం పదో తరగతి పరీక్షలు ఉంటాయి. అటు తర్వాత మిగతా విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కాలం కావడంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని తెలుస్తోంది. ఏప్రిల్ చివర్లో లేదా మేలో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం.

Telangana Cabinet Meeting | రైతు భరోసాపై..

రాష్ట్రంలో యాసంగి సీజన్​ సగం దాటిపోయింది. అయినా రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో పెట్టుబడిసాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని గతంలో మంత్రి తుమ్మల (Minister Tummala) తెలిపారు. అయితే సంక్రాంతి పోయి నెల దాటిన నిధులు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ సీజన్​లో అసలు రైతు భరోసా వేస్తారా.. లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related articles

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Chickpea Crop Damage | శనగపంటకు వరుణ గండం.. ఆందోళనలో రైతులు..

అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.