ePaper
More
    HomeతెలంగాణCabinet Meeting | 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

    Cabinet Meeting | 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Cabinet Meeting | తెలంగాణ(Telangana) మంత్రివర్గం ఈ నెల 5న సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme), రాజీవ్ యువవికాసం(Rajiv Yuva Vikasam), వానాకాలం పంటలు, భూభారతిపై ఈ మీటింగ్​లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదికపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు డీఏ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ సీఎం రేవంత్​రెడ్డి తన ప్రసంగంలో ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించలేదు. ఈ క్రమంలో వారి సమస్యలపై చర్చించనున్నారు.

    Cabinet Meeting | కాళేశ్వరంపై..

    కాళేశ్వరం విజిలెన్స్, NDSA నివేదికలపైనా మంత్రివర్గ విస్తరణలో చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్​ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రులు ఈటల రాజేందర్(former minister Etala Rajender)​, హరీశ్​రావు(Harish Rao)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది.

    Cabinet Meeting | రైతు భరోసా.. బోనస్​పై ప్రకటన ఉంటుందా..

    ప్రభుత్వం సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తామని ప్రకటించింది. దీంతో యాసంగిలో ఎంతో మంది రైతులు(Farmers) సన్నరకం వరి సాగు చేశారు. అయితే రైతుల నుంచి ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్​ డబ్బులు జమ చేయలేదు. బోనస్​(Bonus)పై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.

    యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసా(Raithu Bharosa) ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పడలేదు. నాలుగు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నగదు జమ చేసింది. మిగతా వారు రైతు భరోసా కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు. మరోవైపు వానాకాలం సీజన్​ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఈ సీజన్​కు సంబంధించిన రైతు భరోసా అయినా సకాలంలో వేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా, బోనస్​పై కేబినెట్​(Cabinet)లో చర్చించి ప్రకటన చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

    Latest articles

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    More like this