Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గం సమావేశం అయింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరు మర్చాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH)గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో TVVP ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. ఖమ్మంలో టీటీడీకి 20 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గం సమావేశం అయింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరు మర్చాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH)గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో TVVP ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి, కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు చేయాలని నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో.. JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయించింది.

Telangana Cabinet Decisions | మెట్రో స్వాధీనం

హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro)ను స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం. మార్చి 31 లోపు మెట్రోను టేకోవర్ చేసుకునేందుకు గతంలో ఎల్ అండ్ టీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మొత్తం డీల్ విలువ రూ.15 వేల కోట్లు కాగా.. మెట్రోపై ఉన్న అప్పు రూ.13 వేల కోట్లు. దీంతో ప్రభుత్వం ఎల్​అండ్​టీకి ఈక్విటీ వాటా కింద రూ. 2 వేల కోట్లు చెల్లించాలి. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి రావాలంటే మొదటి దశ ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని కేంద్రం షరతు విధించింది.

Telangana Cabinet Decisions | జనగణనపై..

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గంలో చర్చించారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణనను మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. హౌస్ లిస్టింగ్​కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను ఆయన వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారని వెల్లడించారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. నియోపోలీస్​లో నీటి సరఫరాకు HMWS బడ్జెట్ కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...

Hyderabad Park Encroachments | పార్కుల క‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్​లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్​ వేసిన సమయంలో...