అక్షరటుడే, హైదరాబాద్: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 16వ తేదీన ఉభయ సభల సమావేశంలో గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 20వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెడతారు.
Telangana budget | సుదీర్ఘ చర్చ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (ఫిబ్రవరి 23వ తేదీన) తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మార్చి 16వ తేదీ నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు.
