ePaper
More
    HomeతెలంగాణTelangana Formation Day | దేశానికి రోల్​ మోడల్​గా తెలంగాణ.. టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్...

    Telangana Formation Day | దేశానికి రోల్​ మోడల్​గా తెలంగాణ.. టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రమేశ్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Telangana Formation Day | సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి రోల్​ మోడల్​గా నిలిచిందని తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కమిషన్​ ఛైర్మన్​ పటేల్ రమేశ్​ రెడ్డి(Patel Ramesh Reddy) అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్​లో జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

    Telangana Formation Day | జిల్లాలో అన్ని రంగాల్లో ప్రగతి

    కామారెడ్డి జిల్లాలో అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని రమేశ్​రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 12,905 యూనిట్లను రూ.169.9 కోట్ల పెట్టుబడితో, పట్టణ ప్రాంతాల్లో 149 యూనిట్లను రూ.5.76 కోట్లతో వివిధ రకాల వ్యాపార సంస్థలను ప్రారంభించడం జరిగిందన్నారు. 480 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున 48 లక్షలను రైతుల ఖాతా(Farmers account)లో జమ చేయడం చేశామన్నారు.

    Telangana Formation Day | 2.70 లక్షల రైతుకు రైతు భరోసా..

    కామారెడ్డి జిల్లాలో 1,01,535 మంది రైతులకు రూ.733.22 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా(Raithu Bharosa) ద్వారా 2.70 లక్షల రైతుల ఖాతాలో రూ.216 కోట్లను జమ చేశామని పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలుకు లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని రమేశ్​రెడ్డి తెలిపారు. మండలంలోని 23 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 4,225 దరఖాస్తులు స్వీకరించామన్నారు. వాటిపై విచారణ జరిపి లింగంపేట మండలాన్ని భూ వివిధ రహితంగా మార్చినట్లు వెల్లడించారు.

    Telangana Formation Day | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

    జిల్లాలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాకు 11,153 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఇందులో 2,894 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. 144 ఇళ్ల పనులు బేస్​మెంట్​ లెవల్​ వరకు కాగా రూ.1.09 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

    Telangana Formation Day | 3,889 కొత్త రేషన్​ కార్డులు

    జిల్లాలో 3,889 కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) మంజూరు చేసినట్లు రమేశ్​రెడ్డి తెలిపారు. 45,344 మంది కుటుంబ సభ్యులను పాత కార్డుల్లో యాడ్​ చేసినట్లు వివరించారు. అనంతరం ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

    వివిధ శాఖల తరఫున ఏర్పాటు చేసిన స్టాల్స్, శకటాలను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీఎఫ్​వో నిఖిత, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...