HomeసినిమాNandamuri Tejaswini | కెమెరా ముందు మెరుపులు మెరిపించిన బాల‌య్య కూతురు.. సోషల్ మీడియాలో వైరల్​గా...

Nandamuri Tejaswini | కెమెరా ముందు మెరుపులు మెరిపించిన బాల‌య్య కూతురు.. సోషల్ మీడియాలో వైరల్​గా మారిన వీడియో

సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ యజమానులు నాగిని ప్రసాద్ వేమూరి , శ్రీమణి మతుకుమిల్లి , శ్రీదుర్గ కాట్రగడ్డ తేజస్వినిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం ద్వారా తమ బ్రాండ్‌కు ఒక రిచ్ లుక్, క్లాస్ టచ్ అందించారు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandamuri Tejaswini | నందమూరి కుటుంబం అంటే హీరోల ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంద‌రో తారలు సినీ రంగంలో వెలుగొందారు. అయితే ఆ ఫ్యామిలీకి చెందిన‌ మహిళలు ఎక్కువగా బిజినెస్, ప్రొడక్షన్ వైపే దృష్టి పెడతారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రెండవ కుమార్తె తేజస్విని నందమూరి కూడా ఇప్పటివరకు అదే దారిలో ఉన్నారు. ‘అఖండ 2’ వంటి భారీ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తూ వ‌చ్చారు. ఇన్నాళ్లు కెమెరా వెనుకే యాక్టివ్‌గా ఉన్న తేజస్విని, ఇప్పుడు ఆకస్మికంగా కెమెరా ముందు ప్రత్యక్షమై అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Nandamuri Tejaswini | యాడ్ కాన్సెప్ట్ హైలెట్స్

మొదటిసారి తేజస్విని ఒక యాడ్ ఫిల్మ్‌లో నటించారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’కు (Siddhartha Fine Jewellers) ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తేజస్వినీ లుక్స్, స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం యాడ్ కాకుండా, ఇది ఒక కాన్సెప్ట్‌తో కూడిన మినీ మూవీలా తెరకెక్కించబడింది. ఈ యాడ్‌ను డి.యమునా కిషోర్ తెర‌కెక్కించ‌గా, థమన్ ఎస్‌ఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాడ్ ప్రారంభంలో తేజస్విని (Nandamuri Tejaswini) మోడ్రన్ లుక్‌లో ఇండోర్ రాక్ క్లైంబింగ్ చేస్తూ కనిపిస్తారు. ఆమె ఎక్కిన గోడపైకి చేరుకున్న వెంటనే చేతిలోని డైమండ్ రింగ్ హైలైట్ అవుతుంది. సీన్ కట్ అవుతుంటే, ఆ రింగ్ ఒక స్టైలిష్ బ్రేస్‌లెట్‌గా మారి ఆమె చేతిని అలంకరిస్తుంది. ఆ తర్వాత రాయల్టీ లుక్‌లో, రోల్స్ రాయిస్‌లో ఒక ప్యాలెస్ లాంటి ప్రదేశానికి చేరుకుంటారు.

ఇక స్పోర్టీ లుక్ నుంచి రాయల్ లుక్‌లోకి ఆమె మారిపోవడం ఈ యాడ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. అనంతరం, పెళ్లి వేడుక వాతావరణంలో రెండు భిన్నమైన లుక్స్‌లో తేజస్విని అదరగొట్టారు. ఒక దాంట్లో స్టైలిష్ వైట్ లెహంగా, డైమండ్ నెక్లెస్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తే, మరొకదాంట్లో ఎర్రటి పట్టుచీరలో, ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీతో (Traditional Temple Jewelry) హుందాతనాన్ని చాటారు. తేజస్విని కెమెరా ముందు ఇంత కంఫర్టబుల్‌గా కనిపించడంలో పెద్ద ఆశ్చ‌ర్యం ఏమి లేదు. ఆమె నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవరాలు, బాలకృష్ణ కుమార్తె. నటన, ఆత్మవిశ్వాసం ఆమె రక్తంలోనే ఉంది. అందుకే మొదటిసారి కెమెరా ఫేస్ చేసినా, ఆమె ప్రెజెన్స్, గ్రేస్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యాడ్ హల్‌చల్ చేస్తుండడంతో, భవిష్యత్తులో తేజస్విని మరిన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆఫర్లు అందుకోవడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.