అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tejashwi Yadav | రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)లో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
Tejashwi Yadav | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar assembly elections) రాష్ట్రీయ జనతా దళ్ (RJD) దారుణ ఓటమి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తతరం నాయకత్వానికి మరింత బలం చేకూర్చేందుకు తేజస్వీ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
एक नए युग का शुभारंभ!
श्री @yadavtejashwi जी बनाए गए राष्ट्रीय जनता दल के कार्यकारी अध्यक्ष! @yadavtejashwi pic.twitter.com/BLFvzXJsJh
— Rashtriya Janata Dal (@RJDforIndia) January 25, 2026
లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో..
ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సమక్షంలో తేజస్విని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీ యాదవ్.. కొంతకాలంగా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అయితే.. నియామకంతో సంస్థాగత నిర్ణయాల్లో ఆయనకు మరిన్ని అధికారాలు దక్కానున్నాయి. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నాయి.
రోహిణి ఆచార్య పోస్టు వైరల్
కాగా.. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదాలు బట్టబయలయ్యాయి. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన సోదరుడు తేజస్విపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రోహిణి ఆచార్య తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తేజస్వి నియామకాన్ని వ్యంగ్యంగా “పట్టాభిషేకం ముబారక్” అంటూ అభినందించిన ఆమె.. ఇది ఒక మహోన్నత యుగం ముగింపుగా అభివర్ణించారు. ‘రాజకీయాల్లోని ఆ మహోన్నత వ్యక్తి యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ముగింపు; తమ ‘కనుసన్నల్లోని యువరాజు’ పట్టాభిషేకానికి భజనపరులకు మరియు ‘చొరబాటుదారుల ముఠా’కు అభినందనలు.’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరిణామం ఆర్జేడీలోని విభేదాలను బయటపెట్టింది.
सियासत के शिखर – पुरुष की गौरवशाली पारी का एक तरह से पटाक्षेप , ठकुरसुहाती करने वालों और " गिरोह – ए – घुसपैठ " को उनके हाथों की "कठपुतली बने शहजादा" की ताजपोशी मुबारक ..
— Rohini Acharya (@RohiniAcharya2) January 25, 2026