HomeతెలంగాణTeenmar Mallanna | తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి

Teenmar Mallanna | తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న కార్యాలయంపై (MLC Teenmar Mallanna office) ఆదివారం దాడి జరిగింది.

తెలంగాణ జాగృతి (Telangana Jagruti) కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో మల్లన్నకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (MLC Kalvakuntla Kavitha) మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్​, అద్దాలు ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా మల్లన్న గన్​మన్లు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్యాలయంలో నేలపై రక్తపు మరకలు ఉన్నాయి. అయితే ఎవరు గాయపడ్డారనే విషయాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపిచారు.

Must Read
Related News