HomeతెలంగాణTeenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

- Advertisement -

Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తీవ్రంగా విమర్శిస్తు ఘాటుగా మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy తో చేతులు కలిపి కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి ఎమ్మెల్సీ కవిత వచ్చారని MLC తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

కాంగ్రెస్​లో కవిత చేరేందుకు సిద్ధమవ్వగా, రాహుల్ గాంధీ అడ్డుచెప్పినట్లు మల్లన్న చెప్పుకొచ్చారు. పార్టీ మారే విషయం తెలిసి KCR ఆమెను పక్కకు పెట్టారని పేర్కొన్నారు.

భారాస పార్టీలో కుంపట్లు రాజేసి, రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం కవిత పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని గులాబీ కార్య కర్తలు అంటున్నారని చెప్పుకొచ్చారు.

Teenmar Mallanna comments | ఎందుకీ విమర్శ..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (MLC Kalvakuntla Kavitha) బీఆర్​ఎస్​ పార్టీ వేటు వేసింది. కవిత గత కొంతకాలంగా బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

గతంలో తన తండ్రికి రాసిన లేఖ బయటకు విడుదల కావడంతో కేసీఆర్​ (KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె విమర్శించారు.

బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేయాలని చూశారని ఆమె గతంలో బాంబు పేల్చారు. బీఆర్​ఎస్​లో కేసీఆర్​ మాత్రమే బాస్​ అని.. పరోక్షంగా తన అన్న కేటీఆర్​ (KTR) నాయకత్వాన్ని అంగీకరించేది లేదని వ్యాఖ్యలు చేశారు.

Teenmar Mallanna comments | హరీశ్​రావుపై వ్యాఖ్యలతో..

తాజాగా ఆమె కాళేశ్వరంపై (Kaleshwaram) మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao), మాజీ ఎంపీ సంతోష్​రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం అవినీతి వారే కారణమని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. వారి తీరుతో కేసీఆర్​కు మరకలు అంటాయన్నారు. పార్టీ ఏమైపోయినా పర్వాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే భారాస నుంచి కవితను వెలివేశారు. ఈ నేపథ్యంలోనే తీర్మాన్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Must Read
Related News