అక్షరటుడే, కామారెడ్డి: TRP | తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన ద్వారా రాష్ట్రంలోని బీసీలను తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఏకం చేశాడని టీఆర్పీ ఎన్నికల ఇన్ఛార్జి లింగాల గంగాధర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party) నాయకుల సమావేశం నిర్వహించారు.
TRP | బీసీలకు అన్యాయం జరుగుతోందనే..
ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత మల్లన్న గ్రహించి పార్టీని స్థాపించారని తెలిపారు. బీసీల ఓట్లు బీసీలే వేసుకోవాలని, అందుకే జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న బీసీ నాయకులనే ఎన్నుకోవాలని సూచించారు.
TRP | బీసీల వెంటే మల్లన్న..
బీసీ నాయకులు (BC leaders) ఎక్కడ ఉంటే ఆ నాయకుల వెనకే మల్లన్న ఉంటాడని లింగాల గంగాధర్ పేర్కొన్నారు. గత 70ఏళ్లుగా సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా వెనుక బడ్డారని, రాజ్యాధికార పార్టీలో 60 శాతం బీసీ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ఏదో ఒక పార్టీలో బీసీలు బానిసలుగా ఉండవద్దని సూచించారు. రాజ్యాధికార పార్టీలోకి వచ్చి నాయకులుగా ఎదగాలన్నారు. జిల్లావ్యాప్తంగా 4 మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి తదితరులు పాల్గొన్నారు.