అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు వేసింది. దీంతో ఆయన సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) అనంతరం మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు ఇస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై మల్లన్న స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నిజంగా మొనగాడు అయితే కేసీఆర్, హరీశ్‌రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నారు. అలా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
Teenmar Mallanna | మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు
సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని ఆరోపించారు. అందరు దొంగల ముఠా అన్నారు. కేసీఆర్ పక్కా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారన్నారు. తాను కూడా బాధితుడినని చెప్పారు. అధికారులు తన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారని తెలిపారు. అయినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయారని ఆరోపించారు.
Teenmar Mallanna | పక్కదారి పట్టించడానికి..
బీసీ రిజర్వేషన్లను (BC Reservations) పక్కదారి పట్టించడానికి కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫ్యూచర్ సిటీ అంటారని, ఫోన్ ట్యాపింగ్ కేసు అని రేవంత్ రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. వీరిది ఒక అంశాన్ని మరిపించడానికి మరో అంశం తెరమీదకు తెచ్చే దొంగల ముఠా అని విమర్శించారు.