అక్షరటుడే, డిచ్పల్లి: Teej festival | గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగ తీజ్. ప్రకృతి ఆరాధకులైన గిరిజనులు తమ సంప్రదాయ వేడుక అయిన తీజ్ ఘనంగా జరుపుకుంటారు. ప్రతియే వర్షాకాలంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, కుటుంబాలు చల్లగా ఉండాలని పెద్దలు, మంచి భర్త రావాలని యువతులు వేడుక జరుపుకుంటారు.
ఇందులో భాగంగా డిచ్పల్లి మండలంలోని యానంపల్లి తండాలో సోమవారం బంజారాలు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ బుట్టలను యువతులు తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ శివారులోని చెరువులో గోధుమ బుట్టలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులనృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, సొసైటీ ఛైర్మన్ రాంచందర్ గౌడ్, సీనియర్ నాయకులు హాజరై సేవలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.