అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | మండలంలోని స్టేషన్ తండాలో ఆదివారం తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఏటా శ్రావణమాసంలో తీజ్ వేడుకలు జరుపుకుంటామని, గిరిజనుల జీవితంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగగా, పెళ్లి కాని యువతులు తమ జీవితం బాగుండాలని తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో గోధుమ నారుకు నీరు పోసి పెంచుతారని చెప్పారు. తొమ్మిదో రోజు ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండాపెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
