ePaper
More
    HomeతెలంగాణGovernment Schools | సర్కారు బడుల్లో సాంకేతిక బోధన.. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

    Government Schools | సర్కారు బడుల్లో సాంకేతిక బోధన.. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Government Schools : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు అందించనుంది.

    ఆ మేరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రోహిణి నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యా శాఖ MOU కుదుర్చుకుంది.

    రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఆయా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో #EdTech సదుపాయాలు కల్పించడం వల్ల రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది.

    కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో ఏక్ స్టెప్ సంస్థ 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో ఐదు వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి అయిదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ను ఈ సంస్థ అందిస్తుంది.

    ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు ఫిజిక్స్ వాలా సంస్థ సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది.

    రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా ఖాన్ అకాడమీ వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది.

    ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.

    ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పై జమ్ ఫౌండేషన్ కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణను అందిస్తుంది.

    ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచం కోసం పనిచేస్తుంది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...