HomeUncategorizedSpicejet | మరో విమానంలో సాంకేతిక లోపం

Spicejet | మరో విమానంలో సాంకేతిక లోపం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Spicejet | నిత్యం విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్​లో విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్​పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంతో పాటు హాస్టల్​లో ఉన్నవారు మృతి చెందారు. మృతుల్లో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని కూడా ఉన్నారు. ఈ ప్రమాదం అనంతరం విమానం ఎక్కాలంటే ప్రయాణికులు ఆలోచిస్తున్నారు.

Spicejet | నిత్యం సమస్యలు

అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. నిత్యం విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో విమానంలో వెళ్లాలంటనే ప్రయాణికులు జంకుతున్నారు. గంటల ముందు ఎయిర్​పోర్టుకు చేరుకున్నాక సాంకేతిక సమస్యతో రన్​వేపై విమానాలు నిలిచిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్(Chennai to Hyderabad) వస్తున్న స్పైస్ జెట్(Spicejet) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్​ అయింది. రెండు గంటలుగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌(Chennai Airport)లో విమానం లోనే ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారు ఎయిర్​ లైన్స్​ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.