ePaper
More
    HomeజాతీయంAlliance Airlines​ | విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఆగ్రహం

    Alliance Airlines​ | విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alliance Airlines​ | మరో విమానం సాంకేతిక లోపంతో రన్​వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)లో ఆదివారం చోటు చేసుకుంది.

    అలియన్స్ ఎయిర్‌లైన్స్​కు చెందిన విమానం శంషాబాద్​ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. మూడుసార్లు రన్‌వేపైకి వెళ్లిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి వచ్చింది. దీంతో అధికారులు విమానాన్ని నిలిపివేశారు. తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన చేపట్టారు. 37 మంది ప్రయాణికులు ఆ విమానంలో తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్​ ఆలస్యం కావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Alliance Airlines​ | కొన్నాళ్లు సాఫీగా..

    ఎయిర్​ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్​ విమానం జూన్​ 12న కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. అనంతరం వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. పలు విమానాలు రన్​వే పై నిలిచిపోగా.. మరికొన్ని సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్​ అయ్యాయి. వరుస ఘటనలతో ప్రజలు విమానాలు ఎక్కాలంటేనే భయపడ్డారు. అయితే ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో కొన్ని రోజులుగా సాఫీగా ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో అలియన్స్​ ఎయిర్​లైన్స్​ విమానం నిలిచిపోవడం గమనార్హం.

    Alliance Airlines​ | మండిపడుతున్న ప్రయాణికులు

    విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical issues) తలెత్తి ఆగిపోతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమిషం ఆలస్యం అయినా ప్రయాణికులను లోనికి అనుమతించని ఎయిర్​లైన్స్​ సంస్థలు గంటల కొద్ది ఆలస్యం అయితే ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు. ముందే విమానాల మెయింటెనెన్స్​ సరిగ్గా చూసుకోవాలని.. బయలుదేరే ముందు నిలిచిపోతే తమ ప్రోగ్రామ్స్​ నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    Nizamsagar | మూగబోయిన మాగి గ్రామం.. భజన కళాకారుడు రాములు కన్నుమూత

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని మాగి (maagi) గ్రామానికి చెందిన ప్రముఖ భజన గాయకుడు, గ్రామీణ కళారంగంలో...

    More like this