HomeUncategorizedAir India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్ (Flight)​ ఎక్కాలంటనే భయపడుతున్నారు. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలతో విమానాలు నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేయడం వంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

హైదరాబాద్ నుంచి ఫుకెట్ (Hyderabad – Phuket) వెళ్తున్న విమానంలో సమస్య వచ్చింది. టేకాఫ్ అయిన వెంటనే పైలెట్​ సమస్య గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోనే ల్యాండ్ చేశాడు. కాగా అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. జూన్​ 12న అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం కూలిపోగా.. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని కూడా ఉన్నారు.

Air India | వరుస ఘటనలతో కలవరం

విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. ఫ్లైట్​లోని ఒక ఇంజిన్​లో సమస్య రావడంతో పైలెట్​ పాన్ కాల్​ (Pan Call) ఇచ్చారు. అనంతరం ముంబయిలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలో ప్రయాణికులు ఆందోళన చెందడంతో పాటు ఎయిర్​ లైన్​ సంస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే అన్ని తనిఖీలు చేసి విమానాన్ని ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.

Must Read
Related News