అక్షరటుడే, వెబ్డెస్క్ : Air India | ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది. ఢిల్లీ (Delhi) నుంచి విశాఖకు బయలు దేరిన AI-451 విమానంలో సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించాడు.
ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. అనంతరం పవర్ షట్ డౌన్ అయినట్లు గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. దీంతో AI 451 తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ల్యాండ్ అయింది.
ఎయిర్ ఇండియా విమానం తన ప్రయాణాన్ని ప్రారంభించగానే సహాయక విద్యుత్ యూనిట్ (APU)లో ఒక లోపాన్ని సిబ్బంది గుర్తించారు. APU గాలిలోనే ఆటో-షట్‌డౌన్ అయింది. సిబ్బంది పునఃప్రారంభించడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి ఢిల్లీకి మళ్లించారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు విమానాన్ని పరిశీలించారు.
Air India | ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
రెండు రోజుల క్రితం ముంబై నుంచి నెవార్క్ (Newark) బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం చాలా సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ముంబైలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) జరిగిన తర్వాత ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తుండటంతో విమానంలో ఎక్కాలంటనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎయిర్లైన్స్ సంస్థలు ముందుగానే విమానాలను చెక్ చేసి ప్రయాణానికి అనువుగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరుతున్నారు.

