Homeజిల్లాలుకామారెడ్డిAdvanced Technology Center | సాంకేతిక విద్యకు పెద్దపీట: ఎమ్మెల్యే మదన్​ మోహన్​రావు

Advanced Technology Center | సాంకేతిక విద్యకు పెద్దపీట: ఎమ్మెల్యే మదన్​ మోహన్​రావు

కాంగ్రెస్​ ప్రభుత్వం సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు పేర్కొన్నారు. ఎలారెడ్డిలో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్​ను ఆయన శుక్రవారం పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Advanced Technology Center | నియోజకవర్గ ప్రజలకు సాంకేతిక విద్య అందించేందుకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ)ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావు (MLA Madan Mohan Rao) తెలిపారు. ఎల్లారెడ్డిలోని ఏటీసీను శుక్రవారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, శిక్షణ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రూ.70 కోట్లతో ఏటీసీని అందుబాటులోకి తెచ్చినందుకు ఎమ్మెల్యేకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిలో ఏటీసీ ఏర్పాటుకు సహకరించిన టాటా గ్రూప్ (Tata Group), సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్‌ ద్వారా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్య అందించే అవకాశం లభిస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక కోర్సులు ప్రారంభించి, ఎల్లారెడ్డిని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.