అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RITES Jobs | పలు పోస్టుల భర్తీ కోసం రైట్స్ లిమిటెడ్ నోటిఫికేషన్(RITES) జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
గురుగావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన(Contract basis) భర్తీ చేస్తారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 19.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(Diploma) ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయో పరిమితి : ఈ ఏడాది ఆగస్టు 23 నాటికి 40 ఏళ్లలోపువారు అర్హులు.
వేతనం : నెలకు రూ. 29,735.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్(Online) ద్వారా..
దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 23.
రాత పరీక్ష తేదీ : ఈనెల 30న రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ(Interview) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు, పూర్తి వివరాలకు https://www.rites.com/ వెబ్‌సైట్‌లో సంప్రదించండి.