అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ Microsoft ఈ మధ్య ఉద్యోగుల కోత ఎక్కువగా పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన కొన్ని వారాల్లోనే, ఇప్పుడు మరికొంత మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల మధ్య కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆప్స్(Layups) ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ దశలవారీగా ఉద్యోగులను తీసేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కూడా తగ్గిస్తూ వస్తుంది.
Microsoft | ఎందుకు ఇలా..
ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగించిన మైక్రోసాఫ్ట్ సంస్థ, తాజాగా మరొకసారి 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని విస్తృతంగా పెంచే ఉద్దేశంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితంగా ఈ ఉద్యోగాల కోత పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం తీసేసిన ఉద్యోగులు సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని ది సియాటిల్ టైమ్స్(The Seattle Times) నివేదిక తెలిపింది.ఈ సారి లేఆఫ్స్ ప్రకటనలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు ప్రభావితం అయ్యారని వార్తలు వస్తున్నాయి.
గత నెలలో సంస్థ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది. రీజనింగ్ మరియు మెమొరీలో అద్భుతమైన పురోగతి కారణంగా ఏఐ నమూనాలు ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారాయని, గిట్‌హబ్ కోపైలట్‌ను ఇప్పటికే 15 మిలియన్ల డెవలపర్లు ఉపయోగిస్తున్నారని కంపెనీ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ షా(Frank X Shaw) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial intelligence రంగంలో దూసుకుపోవడానికి స్విట్జర్లాండ్‌లో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు మరో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.ఈ పెట్టుబడుల ప్రధాన లక్ష్యంలో వచ్చే రెండేళ్లలో కొత్త డేటా సెంటర్ల అభివృద్ధి కూడా ఉంది.