ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Layoffs | సంక్షోభంలో టెక్ ఇండ‌స్ట్రీ.. ఆర్నెళ్ల‌లో ల‌క్ష మందికి ఉద్వాసన‌

    Layoffs | సంక్షోభంలో టెక్ ఇండ‌స్ట్రీ.. ఆర్నెళ్ల‌లో ల‌క్ష మందికి ఉద్వాసన‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Layoffs | టెక్ ఇండ‌స్ట్రీ అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోంది. కృత్రిమ మేధ‌తో పాటు కంపెనీల పొదుపు చ‌ర్య ఉద్యోగాల‌కు ఎస‌రు పెడుతోంది. గ‌త ఆర్నెళ్ల‌లోనే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌లేదు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్, ఇంటెల్, అమెజాన్, మెటా, ఇన్ఫోసిస్ వంటి అనేక ప్రముఖ టెక్ సంస్థలు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) వైపు దృష్టి సారించాయి. అలాగే, ఆటోమేషన్​తో పాటు ఖర్చు ఆప్టిమైజేషన్ చుట్టూ కార్యకలాపాలను పునర్నిర్మించే క్ర‌మంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

    Layoffs | 9 వేల మందికి మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌

    ప్ర‌ముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (tech company Microsoft) 9,100 ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఈ ఏడాదిలోనే కంపెనీ లేఆఫ్‌లు ప్ర‌క‌టించ‌డం వ‌రుస‌గా ఇది నాలుగో సారి. ఈ ఏడాది మొద‌ట్లో ఒక శాతం ఉద్యోగుల‌ను తొల‌గించ‌గా, మే నెల‌లో 6 వేల మందికి ఉద్వాస‌న ప‌లికింది. జూన్‌లో 300 మందిని ఇంటికి పంపించ‌గా, తాజాగా 9,100 మందికి లేఆఫ్‌లు ప్ర‌క‌టించింది. Xbox, గేమింగ్ బృందాల్లో ఈసారి ఎక్కువ‌గా తొల‌గింపులు చేప‌ట్టింది. గ‌తేడాది దాదాపు 10 వేల మందిని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇంటికి పంపించేసింది. Azure, HoloLens, Activision Blizzard ల‌లో గ‌తంలో భారీగా ఉద్యోగుల‌ను తొల‌గించ‌గా, ఇప్పుడు మ‌రోసారి లేఆఫ్‌లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అక‌స్మాత్తుగా త‌మ అకౌంట్లను ఫ్రీజ్ చేశార‌ని, ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వ‌డం లేద‌ని ప్రభావిత ఉద్యోగులు వాపోతున్నారు.

    Layoffs | ఇంటెల్‌లో 20 శాతం..

    ఇక‌, మ‌రో టెక్ దిగ్గ‌జం ఇంటెల్ (Intel) కూడా భారీగా కోత‌ల‌కు పాల్ప‌డుతోంది. కొత్త CEO లిప్-బు టాన్ నేతృత్వంలో ఇప్ప‌టికే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్టిన ఈ ఎల‌క్ట్రానిక్ చిప్ త‌యారీ సంస్థ (electronic chip manufacture) త‌మ ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని తొల‌గించ‌నుంది. ఇప్ప‌టికే జ‌ర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను మూసివేసి, అక్క‌డి ఉద్యోగులంద‌రినీ ఇంటికి పంపించేశారు. ఇక‌, శాంటా క్లారాలో 107 మంది ఉద్యోగుల‌కు లేఆఫ్ ప్ర‌క‌టించారు. సీనియర్ ఇంజినీర్లు, చిప్ డిజైనర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు వంటి వారిపై ఆ సంస్థ వేటు వేసింది. ఇక రానున్న రోజుల్లో మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌మ సిబ్బందిలో 20 శాతం త‌గ్గించుకోవాలని స‌న్నాహాలు చేస్తోంది.

    Layoffs | అమెజాన్ టార్గెట్ 14 వేల మంది..

    మ‌రో అమెరికా (America) దిగ్గ‌జ సంస్థ అమెజాన్ (Amazon industry) కూడా లే ఆఫ్​ల‌ను ఉధృతం చేసింది. ఇప్ప‌టికే నాలుగు విడత‌లుగా ఉద్యోగాల‌కు క‌త్తెర వేసింది. అమెజాన్ దాని బుక్స్, కిండిల్. గుడ్‌రీడ్స్ బృందాలలో ఉద్యోగాలను తగ్గించింది. రానున్న రోజుల్లో మ‌రింత మందికి ఉద్వాస‌న ప‌లుక‌నుంది. పాడ్‌కాస్ట్‌లు, స‌ర్వీసెస్‌, క‌మ్యూనికేష‌న్ వంటి విభాగాల్లోని దాదాపు 14,000 మందిని తొల‌గించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది.

    Layoffs | 8 వేల మందిని ఇంటికి పంపిన ఐబీఎం

    ఐబీఎం (IBM) కూడా ఇప్ప‌టికే 8,000 మందిని తొలగించింది. మ‌రింత మందిని తొల‌గించేందుకు హెచ్‌ఆర్ విభాగం (HR department) స‌న్నాహాలు చేస్తోంది. కంపెనీ రొటీన్ పనులను AI వ్యవస్థలతో భర్తీ చేస్తోంది. ఇది పూర్తి స్తాయి ఆటోమేషన్‌లోకి మరింత లోతుగా అడుగుపెడుతుందని సూచిస్తోంది.

    Layoffs | గూగుల్, ఇన్ఫోసిస్, మెటా కూడా..

    గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌లు, పరికరాల యూనిట్‌లో వందలాది మందిని తొలగించింది. విఫలమైన అసెస్‌మెంట్‌లపై ఇన్ఫోసిస్ 240 మంది ఫ్రెషర్లను తొలగించింది. మెటా ఈ సంవత్సరాన్ని 3,600 ఉద్యోగాల కోతలతో ప్రారంభించింది. రియాలిటీ ల్యాబ్స్ బృందాన్ని తగ్గించింది. ఉద్యోగుల‌కు ఉద్వాస‌న పలుకుతున్న కంపెనీలో జాబితాలో హెచ్‌పీ, ఓలా (HP and Ola) వంటి సంస్థ‌లు కూడా చేరాయి.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...