అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chief Kim | ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉక్రెయిన్(Ukraine) తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తూ కన్నీరు పెట్టకున్నారు.
అత్యంత దృఢంగా, మనోనిబ్బరంగా కనిపించే కిమ్ సైనికుల కుటుంబాలతో(Soldiers Families) మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సైనిక నష్టాలను అరుదుగా అంగీకరించే కిమ్ ఇలా నివాళులు అర్పించడం, కన్నీరు పెట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ వీడియోను కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది.ఇటీవల ప్యాంగాంగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కిమ్(Chief Kim) అమరులైన తమ సైనికులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ కుర్స్క్ ప్రాంతంలో రష్యా తరపున పోరాడిన ఒక యూనిట్ కమాండర్లను కలిశారు.
వారిని “వీరోచిత సైన్యం” అని ఆయన ప్రశంసించారు. KCNA విడుదల చేసిన ఫోటోలలో మరణించిన సైనికుల ఫోటో ఫ్రేమ్‌లపై కిమ్ బ్యాడ్జ్‌లను పిన్ చేస్తూ కనిపించారు. ప్రతి సైనికుడి పేరు వారి ఫొటో కింద బంగారంతో అచ్చు వేయించారు. “గొప్ప విజయం, కీర్తి కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులను నేను స్మారక గోడపై ఉన్న ఫొటోల ద్వారా కలుసుకోగలననే వాస్తవాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నా హృదయం ద్రవిస్తుంది. ఈ నిజం చాలా చేదుగా ఉంది” అని కిమ్ వ్యాఖ్యానించారు.
Chief Kim | క్షమాపణలు ఎలా అడగాలో తెలియట్లేదు..
రష్యా(Russia) తరఫున యుద్ధం చేస్తూ అమరులైన సైనికుల కుటుంబాలకు ఎలా విధంగా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. “సైనికులను రక్షించలేకపోయినందుకు వారి కుటుంబాలకు క్షమాపణలను ఎలా చెప్పాలో, సంతాపం ఎలా తెలపాలో నాకు తెలియడం లేదని” తెలిపారు. ఉత్తర కొరియా విడుదల చేసిన చిత్రాల ప్రకారం, కార్యక్రమం మొత్తం తీవ్ర విషాదంతో కనిపిస్తోంది. కిమ్ మృతుల కుటుంబ సభ్యులను కలిసి పరామవర్శించారు. చిన్న పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. స్మారక గోడపై ఉన్న సైనికుల ఫొటోలకు ఏడుస్తూ నివాళులు అర్పించారు.