అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలన్న ఆశతో బరిలోకి దిగిన టీమిండియా(Team India), చివరి రోజు ఆటకు ముందు విజయం కోసం కేవలం 58 పరుగుల దూరంలో ఉంది.
అయితే ఐదో రోజు కేఎల్ రాహుల్(58 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదో రోజు ఆట మొదలైన కాసేపటికే సాయి సుదర్శన్( 39) చేజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Captain Shubman Gill)(13) మంచి టచ్‌లో కనిపించగా, భారీ షాట్‌కి ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి జురెల్ వచ్చాడు.
Team India | గ్రేట్ విక్టరీ
అయితే నాలుగో రోజున విండీస్(West Indies) అద్భుతంగా పోరాడి టీమిండియాను విసిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 173/2తో ఆట ప్రారంభించిన విండీస్ బ్యాటర్లు జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ Hope (103) శతకాలతో రాణించగా, జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జైడన్ సీల్స్ (32) చివర్లో నిలబడటంతో 390 పరుగులు చేసి ఆలౌట్ అయింది విండీస్ జట్టు. ఈ క్రమంలో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. భారత్ బౌలర్లు తొలి సెషన్‌లోనే పతనాన్ని ఆశించినా, క్యాంప్‌బెల్ – హోప్ జోడీ 177 పరుగుల భాగస్వామ్యంతో అదరగొట్టింది. జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ అందరూ ప్రయత్నించినా, ఈ జోడీని విడదీయలేకపోయారు.మరో వైపు ఆఖరి వికెట్‌కు గ్రీవ్స్ – సీల్స్ కలిసి 79 పరుగులు జోడించడం విండీస్ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది.
ఇక చిన్న టార్గెట్‌ను ఛేదించేందుకు మైదానంలోకి దిగిన భారత్, జైస్వాల్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, సాయి సుదర్శన్ ( 39), కేఎల్ రాహుల్ (58 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ స్కోరుని పరుగులు పెట్టించారు. ఐదో రోజు సుదర్శన్, గిల్ ఔటైన తర్వాత రాహుల్(KL Rahul).. జురెల్‌తో కలిసి భారత్‌కి చిరస్మరణీయ విజయం అందించారు. భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత మెన్ ఇన్ బ్లూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మంగళవారం(అక్టోబర్ 14) తన 44వ పుట్టినరోజును జరుపుకుంటుండగా, ఆయనకి టీమ్ ఇండియా ఈ విజయం రూపంలో మంచి బర్త్‌డే గిఫ్ట్ అందించింది. 2003 నుంచి 2016 వరకు టీమిండియా సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరైన గంభీర్ ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటూ యంగ్ టీమ్‌ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా తమ కోచ్‌కు టీమిండియా గొప్ప బహుమతి అందించింది. ఈ విజయంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది భారత్.
2 comments
[…] (Team India) మహిళల జట్టు చారిత్రక విజయం […]
[…] ఇండియా (Team India)కు ప్రస్తుతం నాయకత్వంలో […]
Comments are closed.