అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టీ20 సిరీస్ సందడి మొదలైంది. అక్టోబర్ 29న కాన్‌బెర్రా (Canberra) వేదికగా జరగనున్న తొలి టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే అక్కడి చలి వాతావరణం భారత ఆటగాళ్లకు కాస్త పరీక్షగా మారింది.
కాన్‌బెర్రాలో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల వరకు పడిపోవడంతో టీమిండియా (Team India) ప్లేయర్లు డబుల్ జాకెట్లు వేసుకుని కూడా వణికిపోతూ ప్రాక్టీస్ చేశారు. అయినా కూడా ఎవరూ వెనక్కి తగ్గకుండా తమ రొటీన్ సెషన్‌ను పూర్తి చేశారు. ఈ ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, చలికి వణుకుతున్న హావభావాలను బీసీసీఐ (BCCI) వీడియో రూపంలో విడుదల చేసింది.
Team India | చలిలో వణుక్కుంటూ..
ఆ వీడియోలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు చలికి వణుకుతూ కూడా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. చలికి తట్టుకోలేక పోయినా ఎవ్వరూ ప్రాక్టీస్ స్కిప్ చేయలేదు. ఇక వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత జట్టు, ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఎలాగైనా గెలవాలని దూకుడుగా ఉంది. ఆసియా కప్ 2025లో అజేయంగా టైటిల్ గెలుచుకున్న తర్వాత, టీ20ల్లో భారత్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి వారిపై దృష్టి నిలిచింది. భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ వేదికలపై హోరా హోరీ మ్యాచ్‌లు జరగనున్నాయి.
చలి వాతావరణంలో ఆస్ట్రేలియా గెలుపు సిరీస్‌ను కొనసాగిస్తుందా? లేదా భారత్ బలమైన సవాల్ విసురుతుందా? అన్నది చూడాలి. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ని (Shubman Gill) పక్కన పెట్టే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వరుస సిరీస్‌లు ఉండనుండగా, గిల్‌కి కాస్త విశ్రాంతి ఇవ్వాలని గంభీర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
Team India | టీమిండియా స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Canberra📍
A chilly evening 🥶, but the fielding intensity remains on point ahead of the T20I series 🔥
🎥 𝐁𝐫𝐚𝐯𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐜𝐨𝐥𝐝, ft. #TeamIndia #AUSvIND pic.twitter.com/W4otqJo9pe
— BCCI (@BCCI) October 28, 2025
