Homeక్రీడలుYashasvi Jaiswal | 24 ఏళ్ల వయసులోనే అత్యధిక టెస్ట్ శతకాలు బాదిన య‌శ‌స్వి జైస్వాల్​.....

Yashasvi Jaiswal | 24 ఏళ్ల వయసులోనే అత్యధిక టెస్ట్ శతకాలు బాదిన య‌శ‌స్వి జైస్వాల్​.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా

Yashasvi Jaiswal | టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో మరోసారి తన స‌త్తా చాటాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో, ఆయన 145 బంతుల్లో తన శతకాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం జైస్వాల్ 173 పరుగులతో (253 బంతుల్లో 22 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yashasvi Jaiswal | భారత క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Stadium) వెస్టిండిస్‌పై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో, యువ సంచలనం జైస్వాల్ అద్భుత శతకంతో మెరిశాడు. బ్యాటింగ్ ప్రారంభించిన నిమిషం నుంచే దూకుడుగా ఆడి, ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

అహ్మదాబాద్ టెస్ట్ విజయంతో మంచి ఊపులో ఉన్న భారత్, ఢిల్లీలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 38 పరుగుల వద్ద ఔటైనా, జైస్వాల్ (Yashasvi Jaiswal) ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తూ తన బ్యాటింగ్ కళతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించుతూ అద్భుత సెంచరీ సాధించాడు.

Yashasvi Jaiswal | జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డులు

  • టెస్ట్ కెరీర్‌లో ఇది 7వ శతకం
  • అత్యల్ప మ్యాచ్‌ల్లో ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో జైస్వాల్ స్థానం సంపాదించాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో (International Cricket) ఇటీవలి కాలంలో బెన్ డకెట్ తర్వాత ఎక్కువ టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
  • అతి చిన్న వయసులో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ ప్ర‌త్యేక‌ స్థానం పొందాడు.

24 ఏళ్లలోపు టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెట‌ర్స్‌లో డాన్ బ్రాడ్ మన్ 12 సెంచ‌రీల‌తో టాప్‌లో నిల‌వ‌గా, సచిన్ టెండూల్కర్ 11, గార్ఫీల్డ్ సోబర్స్ 9, యశస్వి జైస్వాల్ 7, జావెద్ మియాందాద్, గ్రేమ్ స్మిత్, అలస్టర్ కుక్, కేన్ విలియమ్సన్ కూడా 24 ఏళ్లలోపు ఏడు సెంచరీలు సాధించారు. జైస్వాల్ మరో సెంచరీ బాదితే వీరందరిని దాటేస్తాడు.

తొలిరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భారత్ స్కోరు రెండు వికెట్ల‌ నష్టానికి 318 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ వీర‌విహారం చేశారు. 253 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 173 ప‌రుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మ‌రోవైపు క్రీజులో గిల్‌ (20 నాటౌట్) ఉన్నారు. వీరిద్ద‌రు స్కోరు బోర్డు ప‌రుగెత్తిస్తున్నారు. 500 ప‌రుగుల త‌ర్వాత టీమిండియా (Team India) ఇన్నింగ్స్ డిక్లేర్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సాయి సుద‌ర్శ‌న్(87) రాణించాడు. వెస్టిండీస్ బౌల‌ర్స్​లో వ‌రికాన్ రెండు వికెట్లు తీశాడు.