Homeక్రీడలుInd vs Aus | కష్టాల్లో టీమిండియా.. వరుణుడు కాపాడేనా?

Ind vs Aus | కష్టాల్లో టీమిండియా.. వరుణుడు కాపాడేనా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రోహిత్​శర్మ, విరాట్​ కోహ్లీ, గిల్​, అయ్యర్​ ఔట్​ అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind vs Aus | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ టాప్​ ఆర్డర్​ ఘోరంగా విఫలమైంది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్​ ఆడుతున్న రోహిత్​ శర్మ (Rohith Sharma), విరాట్​ కోహ్లీ నిరాశ పరిచారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం పెర్త్​ వేదికగా తొలి మ్యాచ్​ ఆరంభం అయింది. టాస్​ గెలిచిన ఆసీస్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. అయితే భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద రోహిత్​ శర్మ (8) అవుట్​ అయ్యాడు. అనంతరం విరాట్​ కోహ్లీ (Virat Kohli) సైతం డకవుట్ కాగా.. కెప్టెన్​ గిల్​ సైతం 10 పరుగులకే వెనుదిరిగాడు.

Ind vs Aus | ఆటంకం కలిగిస్తున్న వర్షం

భారత్​–ఆసీస్​ మ్యాచ్​కు (India – Australia Match) వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికే పలు మార్లు వర్షంతో మ్యాచ్​ నిలిచిపోయింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో వర్షం పడడంతో మ్యాచ్​ను నిలిపివేశారు. అనంతరం డక్​ వర్త్​ లూయిస్​ పద్ధతి ప్రకారం 32 ఓవర్లకు మ్యాచ్​ను కుదించారు. అనంతరం వర్షం తగ్గడంతో మ్యాచ్​ ఆరంభం అయింది. అయితే కొద్దిసేపటికే శ్రేయస్​ అయ్యర్​ (Shreyas Iyer) (11) ఔట్​ అయ్యాడు.

అనంతరం మళ్లీ వర్షం పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 16.4 ఓవర్లలో 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అక్షర్​ పటేల్​ (14), కేఎల్ రాహుల్​ (KL Rahul) క్రీజులో ఉన్నారు. ఇలాగే వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్​ రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంతో వరుణుడు భారత్​ను కాపాడేనా అంటూ సోషల్​ మీడియాలో నెటిజెన్లు కామెంట్​ చేస్తున్నారు. కాగా ఏడు నెలల తర్వాత వన్డే మ్యాచ్​ ఆడుతున్న రోహిత్​ శర్శ, విరాట్​ కోహ్లీ విఫలం కావడంతో ఫ్యాన్స్​ నిరాశ చెందుతున్నారు.