అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SA | భారత్–దక్షిణాఫ్రికా South Africa మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కటక్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ నమోదు చేసింది.
హార్దిక్ పాండ్యా (59) హాఫ్ సెంచరీ, బుమ్రా మెరుపులు, జితేష్ కీపింగ్ మెరుపులు, యంగ్‌స్టర్ తిలక్ వర్మ సైలెంట్‌గా సరికొత్త మైలురాయి సాధించడం ఈ మ్యాచ్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది . భారత్ మొదట బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసింది. చేజింగ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
IND vs SA | ఈ మ్యాచ్‌లో నమోదైన కీలక రికార్డులు ఇవి—
జస్ప్రీత్ బుమ్రా – టీ20ల్లో వికెట్ల శతకం
భారత్ సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా Bumrah అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండో భారతీయ బౌలర్‌గా రికార్డ్ నమోదు చేశాడు.. బుమ్రా ఈ ఘనతను 78 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. అతనికంటే ముందుగా ఈ మైలురాయిని చేరిన భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే.
జితేష్ శర్మ – వికెట్ కీపింగ్‌లో అరుదైన రికార్డు
వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ మ్యాచ్‌లో 4 డిస్మిసల్స్ చేసి భారత దేశంలో రెండో అత్యుత్తమ ప్రదర్శన చూపించిన కీపర్‌గా రికార్డ్ సాధించాడు. టీ20లో భారత కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ రికార్డు ఇంకా ధోనీ పేరు మీదే ఉంది. ఎంఎస్ ధోనీ ఒక్క టీ20 మ్యాచ్‌లో 5 డిస్మిసల్స్ నాలుగు సార్లు చేశారు.
హార్దిక్ పాండ్యా – టీ20ల్లో 100 సిక్సర్లు
టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా Hardik Pandya అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన నాల్గవ భారతీయుడిగా నిలిచాడు. అతనికంటే ముందుగా ఈ జాబితాలో ఉన్నవారు రోహిత్ శర్మ – 205, సూర్యకుమార్ యాదవ్ – 155, విరాట్ కోహ్లీ – 124
సొంత గడ్డ మీద దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన అతి పెద్ద విజయం
భారత్‌కు టీ20ల్లో దక్షిణాఫ్రికాపై మూడవ అతిపెద్ద విజయం ఇది. ముఖ్యంగా భారత దేశంలో దక్షిణాఫ్రికాపై లభించిన అతి పెద్ద గెలుపు ఇది.
తిలక్ వర్మ – చిన్న వయసులో 1000 పరుగుల భారత రికార్డు
యువ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ Tilak Varma 25 ఏళ్ల లోపు వయస్సులో టీ20 క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. తిలక్ వయస్సు: 23 ఏళ్లు 31 రోజులు మాత్రమే.
కటక్ మ్యాచ్‌తో సిరీస్‌కు గ్రాండ్ స్టార్ట్ ఇచ్చిన టీమిండియా, రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగిస్తుందో చూడాలి. ఫ్యాన్స్ Fans మాత్రం ఇప్పటికే ఈ గెలుపును సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తున్నారు.