ePaper
More
    Homeక్రీడలుIND vs ENG | ఇంగ్లండ్ పరుగులను సమం చేసిన టీమిండియా.. 387కు ఆలౌట్​

    IND vs ENG | ఇంగ్లండ్ పరుగులను సమం చేసిన టీమిండియా.. 387కు ఆలౌట్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : ఇంగ్లాండ్ – టీమిండియా లార్డ్స్ టెస్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగాంగా మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ England Team స్కోర్​ను టీమిండియా జట్టు సమం చేసి ఆలౌట్ అయింది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో ఇది జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ innings లో ఇండియా జట్టు 387 పరుగులు చేసింది.

    జడేజా Jadeja 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా 131 బంతుల్లో 72 పరుగులు చేసి, క్రిస్ ఓక్స్ బౌలింగ్ లో ఔట్​ అయ్యాడు. జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​ బాట పట్టాడు. సుందర్ వాషింగ్టన్ సుందర్ 23 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు.

    IND vs ENG : రికార్డుల మోత

    4 వికెట్ల నష్టానికి 248 పరుగులతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ, రాహుల్ Rahul ​ వికెట్​ను ప్రారంభంలోనే కోల్పోయింది. లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్ లో రాహుల్​ సింగిల్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బషీర్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు.

    తర్వాత ఇన్నింగ్స్ ను జడేజా, నితీష్ ముందుకు తీసుకెళ్లారు. టీ విరామం వరకు వికెట్ పడనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత స్టోక్స్ షాక్ ఎక్స్ ట్రా బౌన్సర్ తో నితీష్ (29)ను వెనక్కి పంపాడు.

    3 వికెట్ల నష్టానికి 145 పరుగులతో టీమిండియా మూడో రోజు తొలి సెషన్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఆడుకుంటూ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ రిస్కీ సింగిల్ తీసే ప్రయత్నంలో ఔట్​ అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన అద్భుతమైన త్రో వల్ల రనౌటయ్యాడు.

    ఈ ఆటకు ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. జో రూట్ Joe Root (104), బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) పరుగులు చేశారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీసుకున్నాడు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...